టిక్ టాక్ సహా పలు చైనీయుల యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. చైనా సరిహద్దు దగ్గర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చైనీయుల యాప్స్ భద్రతా సమస్యలకు కారణం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. టిక్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ దక్కించుకున్న యాప్. భారత దేశంలో కూడా టిక్ టాక్ సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో టిక్ టాక్ బ్యాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. "ఎప్పటి వరకూ మన దేశానికి తగిన గౌరవం ఇస్తారో, ఎప్పటి వరకూ మన జీవితానికి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తారో అప్పటి వరకూ టిక్ టాక్ బ్యాన్ చెయ్యకూడదు" అంటూ ఓ సెటైర్ లాగా ఉండే ట్వీట్ పెట్టారు. దీనర్థం.. మన దేశానికి గౌరవం ఇవ్వనప్పుడు, మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించనప్పుడు మనం బ్యాన్ చెయ్యాలి అనే కదా. ఈ సెటైర్ కొంతమందికి అర్థం కాకపోవడంతో నిఖిల్ టిక్ టాక్ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకుని నిఖిల్ పై విమర్శలకు దిగారు.
అయితే మరో ట్వీట్ లో నిఖిల్ #బ్యాన్ చైనీస్ ప్రోడక్ట్స్ అనే హ్యాష్ టాగ్ జత చేసి మరీ మొదటి ట్వీట్ సెటైర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
TIKTOK shudnt be banned... as long as they respect our country.. our life and DEMOCRACY
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2020
"Period" #tiktokbanindia