'సూపర్‌స్టార్‌ అను నేను' డబుల్‌ ధమాకా

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ, కొడుకు మహేష్‌బాబుతో కలిసి గతంలో పలు చిత్రాల్లో నటించారు. 'కొడుకు దిద్దిన కాపురం', ముగ్గురు కొడుకులు, గూఢాచారి 117' తదితర చిత్రాలు ఈ తండ్రీ కొడుకుల కలయికలో తెరకెక్కిన చిత్రాలు. అప్పట్లో ఇవి సూపర్‌ సెన్సేషన్‌ అయిన సినిమాలు. ఆ సినిమాలు మహేష్‌ చిన్నతనంలో నటించినవి. ఆ తర్వాత మహేష్‌ హీరో అయ్యాక కూడా కృష్ణ, మహేష్‌ సినిమాల్లో సందడి చేశారు. అయితే చాలా కాలంగా కృష్ణ - మహేష్‌బాబుతో కలిసి నటించింది లేదు. ఇప్పుడు అభిమానులకు ఆ కన్నుల పంట కలగనుంది. మహేష్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భరత్‌ అను నేను' సినిమాలో కృష్ణ ఓ కీలకపాత్రలో నటించనున్నారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అయితే ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్‌ నుండి అపీషియల్‌గా ఇన్‌ఫర్మేషన్‌ రాలేదు కానీ, ఈ గాసిప్‌తో సూపర్‌ స్టార్‌ అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు. కొరటాల దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండడం ఈ సినిమాకి ప్రత్యేక విశేషం. డి.వి.వి. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తోంది. మరో పక్క మహేష్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'స్పైడర్‌' త్వరలో విడుదల కానుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS