కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ... రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడింది. దాంతో పాటు కొన్ని ఆర్థిక పరమైన సమస్యలూ ఎదురయ్యాయి. ప్రస్తుతానికి అవన్నీ క్లియర్ అయినట్టు టాక్. అందుకే ఈ సినిమాని విడుదల చేయడానికి కృష్ణవంశీ ముందుకొచ్చారు. ఈనెల 22న రంగమార్తండని విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే.. హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం రంగమార్తండ ప్రీమియర్ షో వేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. కృష్ణవంశీ తీసిన ఉత్తమ చిత్రాల్లో రంగమార్తండ నిలుస్తుందని దర్శకులు కితాబు ఇస్తున్నారు. దానికి తోడు ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం పోటీ పడి మరీ నటించారని విశ్లేషణలు వస్తున్నాయి. పైగా ఇటీవల బలగం అనే సినిమా విడుదలైంది. చిన్న సినిమాగా, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, స్లో ఫేజ్ తో విడుదలైన ఈ సినిమాని మౌత్ టాక్ తో హిట్టయ్యింది. మంచి సినిమాలకు ఆదరణ తగ్గలేదన్న విషయం బలగం నిరూపించింది. ఆ ధైర్యంతోనే కృష్ణవంశీ ఇప్పుడు ఈ సినిమాని విడుదల చేయడానికి ధైర్యం చేశారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.