'చిట్టిబాబు ముద్దొచ్చేశాడు': కృష్ణవంశీ

మరిన్ని వార్తలు

తాజాగా చిట్టిబాబుకి క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ నుండి ప్రశంసలు దక్కాయి. చరణ్‌ని 'అబ్బాయ్‌' అని సంబోధిస్తూ 'రంగస్థలం' సినిమాపై కృష్ణవంశీ స్పందించారు. 'రంగస్థలం' సినిమా చూస్తుంటే, చాలా మందికి ఇది కృష్ణవంశీ సినిమా అనే ఫీలింగ్‌ వచ్చిందట. అదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పలువురు ప్రస్థావిస్తున్నారట. ఈ సందర్భంగా కృష్ణవంశీ స్పందించారు. 'సుకుమార్‌ ఇంటెలిజెన్స్‌ని అర్ధం చేసుకోవడంలో నీ గట్స్‌ అద్భుతం. సింహంలా నటించావ్‌. గాడ్‌ బ్లెస్‌ అబ్బాయ్‌' అంటూ చరణ్‌ని పొగడ్తలతో ముంచెత్తేశాడు కృష్ణవంశీ.

అలాగే చిట్టిబాబు డిజేబులిటీ వినబడకపోవడం తెలుసుకున్న సన్నివేశంలో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగున్నాయనీ కృష్ణ వంశీ అన్నాడు. టోటల్‌గా 'రంగస్థలం' చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్‌ తెలిపారు కృష్ణవంశీ. గతంలో చరణ్‌తో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తెరకెక్కించాడు కృష్ణవంశీ. అనూహ్యంగా ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. చరణ్‌ ఎప్పుడు సినిమా చేస్తానన్న మళ్లీ సినిమా చేసేందుకు తాను రెడీ అని కృష్ణవంశీ అన్నాడు.

చరణ్‌తో సినిమా చేయడం చాలా కంఫర్ట్‌ అని చాలా మంది దర్శకుల అభిప్రాయం. అందుకే చరణ్‌తో కలిసి మళ్లీ మళ్లీ సినిమా చేయాలని ఎదురు చూస్తుంటారు ప్రతీ డైరెక్టర్స్‌. అలాగే కృష్ణవంశీ కూడా. ప్రస్తుతం బోయపాటితోనూ, తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనూ చరణ్‌ నటించాల్సి ఉంది. ఆ తర్వాతేమైనా కృష్ణవంశీకి చరణ్‌ ఛాన్సిస్తాడేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS