కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా జపిస్తున్న పేరు. తొలి సినిమా ఉప్పెన విడుదల కాక ముందే గంపెడు ఆఫర్లు ఎగరేసుకుపోయింది. ఉప్పెనకు ఇప్పుడు మంచి టాక్ వస్తోంది. హీరోయిన్ గా కృతి శెట్టి సూపర్ హిట్టయిపోయినట్టే అంటున్నారు. దాంతో.. కృతి కి మరిన్ని అవకాశాలొచ్చే ఛాన్సుంది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల దృష్టి కృతిపై పడింది. ముందుగా ఎన్టీఆర్ సినిమాలో కృతికి ఛాన్సు రాబోతోందన్నది లేటెస్ట్ టాలీవుడ్ సమాచారం.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కథానాయికగా కృతి శెట్టిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయట. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. చిన్న పాత్రనైనా హీరోయిన్ లెవిల్లో ట్రీట్ చేస్తాడు. అలానే... ఈ సినిమాలో ఓ పాత్రకు గాను కృతిని ఎంచుకున్నారని సమాచారం. అయితే పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాలి.