ఉప్పెనతో కృతిశెట్టి సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆసినిమాతో తాను స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులపై సంతకాలు చేసింది.
తన సినిమాలు ఇప్పుడు ఒకదాని తరవాత మరోటి రిలీజ్ అవుతున్నాయి. తన కాల్షీట్లు దొరకడం నిర్మాతలకు గగనం అయిపోయింది. మరో హిట్టు పడితే... తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చని భావిస్తోంది కృతి. ఇటీవలే `వారియర్` విడుదైంది. ఈసినిమా ఫ్లాప్ లిస్టులో చేరి.. కృతి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన మాట అటుంచితే, కృతి లుక్స్ కూడా మరీ గొప్పగా ఏం లేవు. తను నవ్వితే.. చూడ్డం ఇంకొంచె కష్టమైపోతోంది. తన ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని... కృత్రిమంగా కనిపిస్తున్నాయి. డబ్బింగ్ ఎవరో చెబుతారు కదా.. పెదాల కదలికలో తప్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. `ఉప్పెన`లో చూసిన గ్లామర్... ఇప్పుడు కనిపించడం లేదు. `వారియర్` అలా కృతి శెట్టికి మైనస్ గా మారింది.
అయితే.. కృతికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే తన చేతిలో ఇంకా చాలా సినిమాలున్నాయి. కాకపోతే... ఇప్పుడే కృతి మేల్కోవాలి. తన మైనస్సుల్ని సరి చేసుకోవాలి. తెలుగు కూడా త్వరగా నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకొనే స్థాయికి ఎదగాలి. అన్నింటికంటే ముఖ్యంగా... తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకోవాలి. ఇవన్నీ చేస్తే.. కృతి ఇంకొంత కాలం టాలీవుడ్ లో ఉంటుంది. లేదంటే.. తన ప్రస్థానం కూడా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది.