తొలి సినిమా `ఉప్పెన`కు ఆరు లక్షల పారితోషికం తీసుకుంది బేబమ్మ.. కృతి శెట్టి. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో.. కృతికి బోలెడన్నిఆఫర్లు వరుస కట్టాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అందుకే.. తన పారితోషికం అమాంతం పెంచేసింది. `ఉప్పెన` బయటకు రాకముందు ఒప్పుకున్న సినిమాలకు 20 నుంచి 50 లక్షల పారితోషికం తీసుకున్న కృతి.. ఉప్పెన విడుదలయ్యాక తన పారితోషికం ఏకంగా కోటి రూపాయలకు పెంచేసిందట. అయినా సరే, తను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు క్యూకడుతున్నారు.
తెలుగులో హీరోయిన్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వాళ్లకున్న డిమాండ్ ఇంకెవరికీ లేదు. దానికి తోడు.. తొలి సినిమాతోనే కృతి చాలా క్రేజ్ సంపాదించేసుకుంది. అందుకే కృతి అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా నాని తో ఓ సినిమా చేస్తోంది కృతి. దీనికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకుడు. ఈ చిత్రం కోసం కృతి కోటి రూపాయలు అడిగిందట. నానితో కలిసి నటిస్తున్న మరో సినిమా `శ్యామ్ సింగరాయ్`కి కృతి తీసుకున్న పారితోషికం 50 లక్షల లోపే. ఇంతలోనే ఎంత మార్పో కదా?