రికార్డులు తిర‌గ‌రాసే.. పాట‌!

మరిన్ని వార్తలు

సాయిప‌ల్ల‌విలో మంచి న‌టి ఉంద‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాను ఎంచుకున్న పాత్ర‌లు, చేస్తున్న సినిమాలు చూస్తే స‌రిపోతుంది. అయితే.. త‌ను గొప్ప డాన్స‌ర్ కూడా. ఆ విష‌యం `ఫిదా`లో `వ‌చ్చాడే..` పాట‌తోనే రుజువైపోయింది. `రౌడీ బేబీ` పాట యూ ట్యూబ్ లో రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసిందంటే.. అదంతా సాయి ప‌ల్ల‌వి డాన్సుల పుణ్య‌మే. ఇప్పుడు `ల‌వ్ స్టోరీ`లోనూ అలాంటి పాటే ఉంది.

 

`సారంగ ద‌రియా` పాటని ఇటీవ‌ల చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. అందులో సాయి ప‌ల్ల‌వి స్టెప్పుల‌కు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను మంగ్లీ పాడింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. పాట లిరిక‌ల్ వీడియోలో.. సాయి ప‌ల్ల‌వి వేసిన రెండు మూడు స్టెప్పుల‌కే..జ‌నాలు హోరెత్తిపోతున్నారు.

 

ఈ పాట ఇది వ‌ర‌క‌టి యూ ట్యూబ్ రికార్డుల‌న్నీ తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని సినీ జ‌నాలు అభిప్రాయ ప‌డుతున్నారు. విడుద‌లైన తొలి రోజే ఏకంగా ఆరు మిలియ‌న్ల వ్యూస్ అందుకుంది. క‌నీసం ఈ పాట 50 మిలియ‌న్ల మార్క్ చేరుకుంటుంద‌ని అంద‌రి న‌మ్మ‌కం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS