పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా గుర్తుందా.? అందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించింది కృతి కర్బందా. అంతకు ముందు 'బోణీ' సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో. సుమంత్ హీరోగా నటించాడు అందులో. రామ్ పోతినేని సరసన 'ఒంగోలు గిత్త'లో హీరోయిన్‌గా కన్పించిన కృతి కర్బంద, చరణ్ హీరోగా రూపొందిన 'బ్రూస్‌లీ'లో మాత్రం 'అక్క' పాత్రలో ఒదిగిపోయింది.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలేమీ లేవుగానీ, కన్నడతోపాటు హిందీలో అమ్మడికి అవకాశాలు బాగానే వున్నాయి. సినిమా అవకాశాల సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఇదిగో ఇలా కిర్రాకు పుట్టించే హాట్ ఫొటోలతో విపరీతమైన పాపులారిటీ పెంచుకుంటోంది. 'అందం చూడవడయా.. ఆస్వాదించవయా..' అని అందరి భామల్లానే కృతి కర్బందా కూడా గ్లామరస్ వేదాంతం చేప్పేస్తుంటుంది. హేటర్స్‌ని ఎంటర్‌టైన్ చేయబోననీ, గ్లామరస్ ప్రపంచంలో అందంగా కన్పించాల్సిందేననీ అంటోంది కృతి కర్బందా.
నటిగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి తాను సిద్ధమని చెప్పే కృతి, 'బ్రూస్‌లీ' సినిమాలో హీరోకి అక్కగా కన్పించినంతమాత్రాన, హీరోయిన్‌గా ఆ తర్వాత అవకాశాలు తగ్గుతాయని తాను అనుకోలేదనీ, ఇప్పటికీ తనకు హాట్ మాట్ అవకాశాలు వస్తూనే వున్నాయంటోంది కృతి కర్బందా. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. బ్లాక్ డ్రెస్‌లో కృతి స్కిన్ టోన్ అదిరిపోయింది కదూ.!
Stunning @kriti_official #KritiKharbanda pic.twitter.com/iv4bnWC3SY
— NOW Gallery ™ (@GalleryNow_) August 2, 2019