ప్రియదర్శి హీరోయిన్‌ 'సస్పెన్స్‌'లో పెట్టింది.!

By iQlikMovies - August 02, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

కమెడియన్‌ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమా ఇటీవల విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమా అయినా, నటన పరంగా ఈమెకు మంచి మార్కులే పడ్డాయి ఈ సినిమాలో. అయితే, ఈ సినిమాలో అమ్మడికి పెద్దగా గ్లామర్‌ ప్రదర్శించే అవకాశాల్లేవు. తాజాగా ఈ నేచురల్‌ బ్యూటీ మరో సినిమాలో నటిస్తోంది.

 

'హుషారు' ఫేమ్‌ దినేష్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, అనన్య హీరోయిన్‌. ఓ మర్డరీ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఇష్యూ చక్కర్లు కొడుతోంది. 2014లో ఉన్న అబ్బాయితో, ఓ అమ్మాయి నేనింకా 1993లోనే ఉన్నా అంటూ ఫోన్‌ చేసి చెబుతుంది. దాని అర్ధం ఏంటీ.? అంటూ బుర్రలు పట్టుకుంటున్నారు. అసలింతకీ ఈ సినిమాలో సస్పెన్స్‌ ఏంటీ.?

 

అనేది తెలియాలంటే, ఆ సినిమా ఏదో చూడాల్సిందే. ఇంతకీ ఏంటా సినిమా.? అంటే సినిమా పేరు 'ప్లే బ్యాక్‌'. అప్పుడెప్పుడో సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణ సంస్థ ఎంకరేజ్‌ చేయడంతో తెరకెక్కిన 'దర్శకుడు' సినిమాని తెరకెక్కించిన హరిప్రసాద్‌ జక్కా ఈ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నాడు. 'దర్శకుడు' అనే చిన్న సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హరిప్రసాద్‌, ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా థ్రిల్లింగ్‌ అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నాడట. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS