పోలా.! పిక్ అదిరిపోలా.! అనేట్లుంది కదా. ఏమనుకున్నారు మహేష్ హీరోయినా? మజాకానా? '1 - నేనొక్కడినే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్.
తొలి సినిమా నిరాశ పరిచినా, అమ్మడి అప్పియరెన్స్ ఆడియన్స్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే అవకాశాలు మాత్రం అంతగా రాలేదీ భామకి. '1 - నేనొక్కడినే' తర్వాత నాగ చైతన్యతో 'దోచెయ్' సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. తర్వాత తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్‌కి తన గ్లామర్, పర్సనాలిటీ పర్ఫెక్ట్ అనుకుంది కాబోలు అక్కడే సెటిలైపోయింది ప్రస్తుతానికి. అయితే అప్పుడప్పుడూ ఇదిగో ఇలా హాట్ ఫోటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది.
చూస్తున్నారుగా, తన పొడుగాటి కాలుపై డ్రాగన్ టాటూను ఎలా చిత్రీకరించుకుందో. సో నైస్ కదా. చేతిలో టాటూ మిషన్‌తో, కాలిపై టాటూ డిజైన్‌తో లేడీ డ్రాగన్ గ్లామర్ అదిరింది కదా. టాటూనే కాదు, టాటూతో ఉన్న కృతిసనన్ గ్లామర్ స్టైల్ కూడా కెవ్వు..కేక కదా.!