ఫెస్టివల్‌ హీరో రెడీ అయిపోతున్నాడులే.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో శర్వానంద్‌కి 'ఫెస్టివల్‌ హీరో'గా పేరుంది. ఫెస్టివల్స్‌కి సహజంగా స్టార్‌ హీరోల సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా, సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలకు పెద్ద హీరోల సినిమాలు స్లాట్‌ బుక్‌ చేసుకుంటాయి. అయితే మనోడు శర్వానంద్‌ మాత్రం అగ్ర హీరోల సినిమాలకు తానేం తక్కువ కాదంటూ, అగ్రహీరోలతో పాటు ప్రతీ పండక్కి తాను కూడా ఓ సినిమాతో వచ్చేస్తుంటాడు. 

సైలెంట్‌గా వచ్చి, తన స్టామినాకి వైలెంట్‌ హిట్‌ కొట్టేస్తాడు. పండగొస్తుందంటే చాలు, శర్వానంద్‌ నుండి ఏ సినిమా వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సారి దసరాకి మనోడు ఏ సినిమాతో వస్తున్నాడనేగా. 'పడి పడి లేచె మనసు'. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం దసరా బరిలో ఉంచేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ సినిమా. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి, శర్వానంద్‌తో తొలిసారి జోడీ కడుతోంది. 

ఆల్రెడీ విడుదలైన పోస్టర్స్‌తో శర్వానంద్‌ కొట్టాల్సిన మార్కులు కొట్టేశాడు. హను సినిమాలంటే సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లవ్‌స్టోరీస్‌నే చూపిస్తాడు. అలాంటిది శర్వా - సాయి పల్లవిలాంటి జంట దొరికితే, ఇంకేముంది. హను క్రియేటివిటీకి రెక్కలొచ్చినట్లే కదా. నానితో 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'తో సూపర్‌ హిట్‌ కొట్టి, తర్వాత 'లై'తో కాస్త నిరాశ పడిన హను రాఘవపూడి ఈ సారి శర్వానంద్‌తో ఎలాంటి హిట్‌ కొడతాడో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS