గ్లామ్‌షాట్‌: ట్రెడిషనల్‌ హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ బాస్‌!

మరిన్ని వార్తలు

ఒంటి నిండా జ్యూయలరీనే అన్నట్లుగా వుంది కదా ఈ గెటప్‌లో ముద్దుగుమ్మ. ఇంతకీ ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? 'వన్‌ - నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్‌. అమ్మడిలో హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ నుండి వచ్చింది. అందునా మోడలింగ్‌ రంగంతో టచ్‌లో ఉన్న పోరి కనుక, ఫ్యాషన్‌కి పెట్టింది పేరు.

 

అయితే, లేటెస్ట్‌గా నెట్టింట్లో సందడి చేస్తున్న ఈ పిక్‌లో మాత్రం కృతి సనన్‌ ట్రెడిషన్‌ వేర్‌లో మెరిసిపోతోంది. పూసలు పొదిగిన డ్రస్‌లో మెడలో ధగ ధగలాడిపోతున్న కంఠాభరణం ధరించింది. ఆ చందమామనే చెవులకు కమ్మలుగా మార్చేసుకుందా.? అన్నట్లుగా ఉన్నాయి ఆ చెవుల కమ్మలు. ముత్యాలు పొదిగిన గాజులు చేతి నిండా ధరించింది. ముఖాన బొట్టు లేకున్నా, అమ్మడి చక్కదనం వర్ణనాతీతం. ఇంత గ్రాండ్‌గా అలంకరించుకున్నా, ఆ హాటీ క్లీవేజ్‌ నుండి మాత్రం చూపు తిప్పుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అందుకే ఆలస్యం చేయకుండా, కృతి హాట్‌ క్లీవేజ్‌ షాట్‌పై ఓ షూట్‌ వేస్కోండి బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS