మహేష్‌తో 'వన్ - నేనొక్కడినే' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతిసనన్. తొలి సినిమాకే నిరాశపరిచింది. తనవంతుగా తాను బాగానే నటించింది కానీ, సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత 'దోచేయ్' సినిమాలో నటించింది కానీ అక్కడా నిరాశే మిగిలింది ఈ పొడుగు కాళ్ల సుందరికి. దాంతో మళ్లీ ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే దుకాణం సర్దేసుకుంది. అదేనండీ బాలీవుడ్‌కి. అక్కడ అరా కొరా సినిమాలతో సరిపెట్టుకుంటోంది. లేటెస్ట్గా వచ్చిన 'లుకా చుపీ' కృతిసనన్‌కి మంచి సక్సెస్ తెచ్చి పెట్టింది.
త్వరలో 'కళంక్' చిత్రం ద్వారా రానుంది. తదుపరి 'పానిపట్', 'హేట్ స్టోరీ 4' తదితర చిత్రాలు కృతిసనన్ చేతిలో ఉన్నాయి. తెలుగులోనూ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తోంది. కానీ, కృతి వైపే ఎవరూ చూడడం లేదు. ఫ్యూచర్లో ఎప్పటికైనా మళ్లీ సౌత్‌లో సినిమాలు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటోంది అందాలా కృతిసన్. ప్రస్తుతం మాల్దీవుల్లో ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. చూస్తున్నారుగా ఈ పిక్‌లో బ్లాక్ బికినీ వేసి, బీచ్ ఒడ్డున ఇసుకలో ఆడుతూ ఎలా మురిసిపోతోందో. బీచ్ అందాల్ని కృతి ఎంజాయ్ చేస్తుంటే, ఆమె అందాల్ని చూసి మనం ఎంజాయ్ చేయాలన్న మాట.