జాతీయ అవార్డు కొట్టాలి!

By iQlikMovies - June 17, 2021 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లే ఆశిస్తార‌నుకోవ‌డం త‌ప్పు. వాళ్ల‌కూ అవార్డు విన్నింగ్ పెర్‌ఫార్మ్సెన్స్ అందించాల‌ని క‌ల ఉంటుంది. అయితే ఆ అవ‌కాశం చాలా త‌క్కువ‌మందికే వ‌స్తుంది. కానీ ఎప్ప‌టికైనా `ఉత్త‌మ‌న‌టి` పుర‌స్కారాన్ని అందుకుని... గ‌ర్వంగా త‌లెత్తుకోవాల‌న్న కోరిక‌లు ఉంటాయి. కృతి స‌న‌న్ కూడా అలాంటి క‌లే కంటోంది. `ఎప్ప‌టికైనా జాతీయ ఉత్త‌మ న‌టి అనిపించుకుంటా` అని ప‌ట్టుద‌ల‌తో చెబుతోంది.

 

`వ‌న్‌- నేనొక్క‌డినే` సినిమాలో న‌టించినా అంత‌గా గుర్తింపు సంపాదించుకోలేక‌పోయింది కృతి. అయితే.. త‌న సుడి తిరిగి `ఆదిపురుష్‌`లో సీత‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇక నుంచి త‌న కెరీర్ జెట్ స్పీడులో ప‌రుగెడుతుంద‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తోంది. ``బ‌యెపిక్‌లంటే నాకు ఇష్టం. అలాంటి అవ‌కాశం వస్తే వ‌దులుకోను. ఆ పాత్ర కోసం ఎన్ని క‌ష్టాలైనా ప‌డ‌తా. అవార్డులు అందుకోవాల‌న్న క‌ల అలాంటి చిత్రాలే తీరుస్తాయి`` అంటోంది కృతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS