మ‌హేష్ హీరోయిన్‌కి మంచి ఛాన్స్‌

By Gowthami - August 04, 2020 - 15:32 PM IST

మరిన్ని వార్తలు

కృతి స‌న‌న్‌.. మ‌హేష్ బాబుతో `నేనొక్క‌డినే` సినిమాలో న‌టించింది. ఆసినిమా స‌రిగా ఆడలేదు. కానీ కృతికి మాత్రం మంచి అవ‌కాశాలొచ్చాయి. `మ‌హేష్ హీరోయిన్‌` అనే ట్యాగ్ లైన్ తో వ‌రుస‌గా ఛాన్సులు సంపాదించుకుంది. `దోచేయ్‌`లో నాగ‌చైత‌న్య‌తో జ‌త క‌ట్టింది. ఆ త‌ర‌వాత బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇప్పుడు ఓ సూప‌ర్ ఛాన్స్ కృతి సంపాదించుకోగ‌లిగింది.

 

హృతిక్ రోష‌న్ `క్రిష్ 4`లో కృతికి క‌థానాయిక‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని బాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. `క్రిష్` సిరీస్‌లో వ‌చ్చిన అన్ని సినిమాలూ సూప‌ర్ హిట్ అయ్యాయి. `క్రిష్ 4` కూడా భారీ స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులో కృతి ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం గొప్ప విష‌య‌మే. నిజానికి ఈ పాత్ర కోసం ప్రియాంక చోప్రాని అనుకున్నార్ట‌. కానీ. ప్రియాంక కాల్షీట్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆ అవ‌కాశం కృతికి ద‌క్కింద‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS