మార్చి 19న ప్రముఖ నటులు మోహన్‌బాబు బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలువురు బర్త్‌డే విషెస్ అందించారు. అయితే, ఆయన ఫ్యామిలీ నుండి ఆయనకు గొప్ప బహుమతి లభించింది. మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి తండ్రి కోసం ఓ సింహాసనం తయారు చేయించింది. దానికి సంబంధించిన ఫోటో ఇన్‌స్టాలో షేర్ చేసింది. మూడు సింహాలతో కూడిన ఈ సింహాసనంపై మోహన్‌బాబు సతీసమేతంగా ఆశీనులు కాగా, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌తో పాటు, మంచు లక్ష్మి కూడా పక్కనే కూర్చున్న ఫోటో ఒకటి అంతర్జాలంలో సందడి చేస్తోంది.
సింహాసనంపై ఆశీనులైన మోహన్‌బాబు విత్ ఫ్యామిలీ ఫోటో నిండుగా కనులకు విందుగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు. ‘ఈ ఫోటోలో కనిపిస్తున్న సింహాసనం నేనే చేయించాను.. నాన్న కోసం. ఈ సింహాసనంలో కనిపిస్తున్న మూడు సింహాలూ మా ముగ్గురికీ (లక్ష్మి, మనోజ్, విష్ణు) నిదర్శనం..’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం మోహన్‌బాబు తమిళంలో సూర్యతో ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్‌తో తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో మోహన్‌బాబు క్యారెక్టర్‌కి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.