`ఉప్పెన`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అదేం అదృష్టమో.... వరుసగా సూపర్ ఛాన్సులు కొట్టేస్తోంది. నాని శ్యామ్ సింగరాయ్‌లో తనే కథానాయిక. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. అందులో సుధీర్ బాబు సరసన నటించబోతోంది. ఇప్పుడు మరో ఆఫర్ కొట్టేసింది. రామ్ సినిమాలో కథానాయికగా కృతిని ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది.
రామ్ - లింగు స్వామి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. `రెడ్` తరవాత.. రామ్ నటించే సినిమా ఇదే. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇందులో కృతిని హీరోయిన్ గా ఎంచుకున్నార్ట. తెలుగు - తమిళ భాషల్లో నిర్మిస్తున్న సినిమా ఇది. దీంతో కృతి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసినట్టే. ఇప్పటికైతే కృతి ఎంపిక గురించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు. అందుకోసం కొన్ని రోజలు ఎదురు చూడాల్సిందే.