విజయ్ కి షాక్ ఇచ్చిన కేటీఆర్

మరిన్ని వార్తలు

హీరో విజయ్ దేవరకొండ కి నిన్నటిరోజున ఒక పెద్ద షాక్ తగిలింది. అయితే ఆ షాక్ ఒక మంత్రి రూపంలో తగిలితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.

వివరాల్లోకి వెళితే, నిన్న మధ్యాహ్నం హీరో విజయ్ దేవరకొండ ఇంటికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లంచ్ కి వెళ్లారు. ఇదే విషయాన్నీ విజయ్ తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ఆయన భోజనానికి తన ఇంటికి రావడంతో ఆ ఆనందాన్ని ఇలా మాటల్లో వర్ణించాడు-

మీకు నచ్చిన లీడర్ మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు.. ఒక్క క్షణం.. అసలు ఏం జరుగుతుంది బాసు.. ఏమైనా జరగోచ్చు.. మనకి నచ్చిన పని మనం చేస్తూ పోవాలి...

అయితే తనకి వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డుని వేళం వేసి తద్వారా వచ్చిన డబ్బుని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తాను అని అదే విషయాన్నీ కేటీఆర్ కి స్వయంగా మెసేజ్ చేయడం దానికి ఆయన సానుకూలంగా స్పందించడం చూసాము..

ఇక ఇప్పుడు విజయ్ ఇంటికి భోజనానికి రావడంతో త్వరలోనే ఈ అంశానికి సంబంధించి వివరాలు తెలుస్తాయి అని అనుకోవచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS