బిగ్ బాస్ సీజన్ టూ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని, ఎపిసోడ్ ఎపిసోడ్‌కీ డోస్ పెంచేస్తున్నాడు. షో ప్రారంభం రోజున కాస్త డల్‌గా కన్పించిన నాని, ఫస్ట్ వీకెండ్ వచ్చేసరికి తానేంటో నిరూపించేసుకున్నాడు.
తాజాగా ముగిసిన వీకెండ్‌లో అయితే రెండు రోజులు బుల్లితెర వ్యాఖ్యాతగా నాని విశ్వరూపం చూపించేశాడని చెప్పక తప్పదు. బిగ్ బాస్ సీజన్ 2 హౌస్ మేట్స్‌లో దాదాపుగా అందరూ తన ఏజ్ గ్రూప్ వారే కావడం నానికి పెద్ద ప్లస్ పాయింట్. తనీష్, నాని కలిసి 'రైడ్' అనే సినిమాలో నటించారు. అలా నాని, తనీష్ మధ్య మంచి ర్యాపో వుంది. 'అరేయ్..' అంటూ నాని, తనీష్‌ని సంబోదించడం, 'అన్నా..' అంటూ తనీష్, నానిని సంబోదించడం ఇంట్రెస్టింగ్‌గా వుంటోంది.
మిగతా కంటెస్టెంట్స్‌తో నాని సరదాగా జోకులేస్తూ, అప్పుడప్పుడూ చిన్న చిన్న వార్నింగ్స్ ఇస్తూ బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2ని రక్తికట్టించేస్తున్నాడు. నాని అంటేనే నాచురల్ స్టార్. ఎక్కడా 'నటన' అన్నట్టు కాకుండా, షోని చాలా 'రియల్'గా నడిపించేస్తూ బుల్లితెర వీక్షకులకు నాని చాలా దగ్గరయిపోయాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పోల్చితే ఇమేజ్ పరంగా నాని చాలా దూరంలో వున్నా, బుల్లితెరకొచ్చేసరికి నాని, దాదాపుగా యంగ్ టైగర్‌కి దగ్గరకొచ్చేశాడని చెప్పక తప్పదు. సీజన్ 2 ఇంత ప్రత్యేకంగా మారడానికి మరో కారణం కూడా వుంది. అదే కంటెస్టెంట్స్. కంటెస్టెంట్లు సైతం కార్యక్రమాన్ని ఎంటర్‌టైనింగ్‌గా మార్చేస్తుండడంతో వీకెండ్స్ మాత్రమే కాదు, మిగతా రోజుల్లోనూ మంచి టీఆర్పీ రేటింగ్స్ ఈ షోకి వస్తున్నాయి.