ఘాజీ చిత్రం పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డిని అతన్ని నమ్మిన రానాని అందరు పొగడ్తలతో తడిసి ముద్దవుతున్నారు.
ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రానాకి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు. అదే సమయంలో త్వరలోనే ఘాజీ సినిమా చూడాలనుకుంటునట్టు ఈ సందర్బంగా తెలియచేసాడు. దీనికి వెంటనే రానా స్పందిస్తూ, ఎప్పుడు చూడాలనుకునేది తెలియచేయాలి అని కోరాడు.
ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అందరికి చిరపరిచితమే, ఇంతకముందు కూడా తరుచుగా వేరు ఇరువురు కలిసి ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం మనం చూసాం.