ఛాన్స్‌పోయిందిగానీ, వివాదం వదలట్లేదు

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ శృతిహాసన్‌కి తమిళ భారీ బడ్జెట్‌ సినిమా 'సంఘమిత్ర' వివాడం ఇంకా వెంటాడుతూనే ఉంది. శృతిహాసన్‌ 'సంఘమిత్ర' సినిమాలో ఛాన్స్‌ వదిలేసుకున్న మాట వాస్తవమే. అయితే దాంట్లోంచి నేనే తప్పుకున్నానంటూ శృతిహాసన్‌ వాదించగా, లేదు లేదు ఆమెను తీసేశారనే ప్రచారం మరో పక్క జరిగింది. అయితే తానే స్వయంగా ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు శృతిహాసన్‌ చెప్పింది. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు స్పష్టం చేసేశారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే 'సంఘమిత్ర' దర్శకుడు సుందర్‌ భార్య అయిన ఖుష్బూ, తాజాగా శృతిహాసన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సినీ రంగం పట్ల ఎంతో మక్కువ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శృతిహాసన్‌ ఇలా చేయడం ఏమీ బాగాలేదని ఖుష్బూ అసహనం వ్యక్తం చేశారు. సినిమాకి ఒప్పుకుని, నచ్చక వదిలేసుకున్నప్పుడు హుందాగా వ్యవహరించాలి తప్ప, సినిమా కథ పూర్తిగా రెడీ అవలేదనే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు ఖుష్బూ. అవును నిజమే. అసలెందుకు శృతిహాసన్‌ ఇలా చేసింది. అసలు ఈ వివాదం వెనుక కథస్త్రంటి అనేది మాత్రం క్లారిటీగా తెలీడం లేదు. 'సంఘమిత్ర' సినిమా షూటింగ్‌ పార్ట్‌ తక్కువగా ఉంటుందనీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రీ ప్రొడక్షన్‌ ఎక్కువగా ఉంటుందని ఖుష్బూ తెలిపారు. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి నటీనటుల వివరాలు ఇంకా తెలియ రాలేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS