`జాతిరత్నాలు` డైరెక్షన్ టీం కలసి చేస్తున్న కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ కె.వి కథని అందించడమే కాకుండా దర్శకులలో ఒకరైన వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి దర్శకులు. పూర్ణోదయా క్రియేషన్స్ శ్రీజా ఎంటర్ టైన్ మెంట్స్ మిత్ర విందా మూవీస్ బ్యానర్ లపై ఏడిద శ్రీరామ్ సమర్పణలో శ్రీజ ఏడిది నిర్మిస్తున్నారు. మూవీ టీజర్ బయటికి వచ్చింది.
2001లో జరిగే కథగా ఈ సినిమా వుండబోతోందని టీజర్ ని బట్టి అర్ధమౌతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `ఖుషీ` ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కోసం హీరోయిన్ ట్రై చేస్తూ వుంటుంది. ఈ క్రమంలో తనని ప్రేమలో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడికి తనకు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఇప్పించమని కోరుతుంది. తరువాత ఏం జరిగింది? ఇందు కోసం ఆ యువకుడు ఏం చేశాడన్నదే మిగతా కథ అన్నట్లు చూపించారు.
ఖుషి సినిమా రోజులు, పవన్ కళ్యాణ్ పెద్ద కటౌట్ ,పవన్ ఫ్యాన్స్ .. ఈ క్రేజ్ అంతా ఈ టీజర్ లో కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ మినగా అందరూ దాదాపు కొత్తవాళ్ళే కనిపించారు. టీజర్ కో కొన్ని చోట్ల ఫన్ పేలింది. ఆగస్ట్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.