సెక్సప్పీల్‌.. పైసా వసూల్‌

By iQlikMovies - October 03, 2018 - 12:03 PM IST

మరిన్ని వార్తలు

'రేసుగుర్రం'లా తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకొచ్చిన ఐటమ్‌ బాంబ్‌ కైరా దత్‌, ఆ సినిమా తర్వాత 'పైసా వసూల్‌' సినిమాలో కన్పించింది. ఈసారి ఐటమ్‌ సాంగ్‌ మాత్రమే కాకుండా, కాస్తంత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనూ కన్పించింది. ప్రస్తుతానికైతే ఓ వెబ్‌ సిరీస్‌తో హల్‌చల్‌ చేయడానికి సిద్ధమయిన కైరా దత్‌, సరైన ఛాన్సిస్తే వెండితెరపై తన సెక్సప్పీల్‌ సత్తా ఏంటో చాటి చెప్తానంటోంది. 

మోడలింగ్‌ నుంచి యాక్టింగ్‌ కెరీర్‌లోకి వచ్చిన ఈ బ్యూటీకి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అంటే బాగా ఇష్టమట. లేడీ డాన్‌ తరహా పాత్రల్లో కనిపిస్తానని చెబుతోన్న ఈ ముద్దుగుమ్మకి అలాంటి ఆఫర్లు ఇచ్చేవారెవరో ఏమోగానీ, ఈ బ్యూటీలో కావాల్సినంత సెక్సప్పీల్‌ని ఆల్రెడీ దర్శక నిర్మాతలు కనిపెట్టేశారు. అందుకే ఆమెకు అన్నీ ఆ సెక్సప్పీల్‌తో ముడిపడి వున్న పాత్రలే దక్కుతున్నాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే కైరా దత్‌ సెక్సప్పీల్‌ పైసా వసూల్‌ అంతే. 

ఈ ఫొటో చూస్తే ఆ విషయం ఇంకోసారి ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతోంది కదూ! వెబ్‌ సిరీస్‌లంటే ఆషామాషీగా లేవిప్పుడు. సినిమాల్ని మించి ఎట్రాక్ట్‌ చేసేస్తున్నాయి. ఆ వెబ్‌ సిరీస్‌లో సెక్సప్పీల్‌కి సెన్సార్‌ వుండదు కాబట్టి, కైరా అందాల విందుకి ఆకాశమే హద్దు అనుకోవచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS