‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో బంగార్రాజు హైలెట్. ఆ సినిమాని నిలబెట్టిన పాత్ర అదే. ఇప్పుడ అదే పాత్రతో బంగార్రాజు సినిమాకి శ్రీకారం చుట్టారు నాగార్జున. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘లడ్డుండా’ అనే లిరికల్ పాట విడుదల చేశారు. ఈ పాట సాకీని నాగ్ ఆలపించడం విశేషం.
'చెరుకు తోటలో చారెడు బియ్యం, వంగతోటలో మరదలి కయ్యం, గలెత్తికొడితే లడ్డుండా '' అంటూ నాగ్ ఆలపించిన లైన్స్ హుషారుగా అనిపించాయి. ఈ సినిమా నాగ్ తో పాటు నాగచైతన్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి కనిపించనున్నారు. చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.