దర్శక దిగ్గజం రాజమౌళి అపూర్వ సృష్టి అయిన బాహుబలి చిత్రాన్ని ఇష్టపడినవారి సంఖ్యతో పోలిస్తే ఇష్టపడనివారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రంతో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చిత్రం చూసి ఈయన అభిమానులు అయిన వారి జాబితాలో నైజీరియాకి చెందిన మహిళా దర్శకురాలు అయిన టోపె ఓశిన్ ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోయింది అట.
ఈ చిత్రం చూసిన వెంటనే తన భావోద్వేగం ఆపుకోలేక తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రాజమౌళి గురించి ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. ఈ చిత్రం చూసాక రాజమౌళితో తనని కూడా ఒక దర్శకురాలిగా పోల్చుకోవడం సరికాదు అని అనిపిస్తుంది అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తే ప్రయత్నం చేసింది.
మొత్తానికి సాధారణ ప్రేక్షకులనే గాక ఇతర దర్శకులని సైతం మెప్పించగలిగాడు మన రాజమౌళి.