నేను మోదీ కి తీవ్ర వ్యతిరేఖం: ప్రకాష్ రాజ్

మరిన్ని వార్తలు

ప్రకాష్ రాజ్ ఉన్నది ఉన్నట్టుగా అలాగే ఆయనకి అనిపించింది ఏమాత్రం తొందరపాటు లేకుండా మాట్లాడే వ్యక్తి అని, ఆయన వ్యక్తిత్వం తెలిసిన వారు అందరు చెప్పే మాట.

గత కొంతకాలంగా అయన #JustAsking అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోది, ఇతర మంత్రులకు సమాజంలో జరిగే సంఘటనల గురించిన ప్రశ్నలు సందిస్తున్నారు. దీనివల్ల ఆయనకి శత్రువులు, మిత్రులు వందల సంఖ్యల్లో పెరిగారు. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా కాన్ క్లేవ్ లో మాట్లాడుతూ ఆయన ఒక ప్రశ్నకి సమాధానంగా నేను యాంటీ హిందూ కాదని కేవలం యాంటీ మోది, యాంటీ అమిత్ షా అని చెప్పాడు.

దీనితో కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ వ్యాఖ్యలకి తాను కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో పాటు తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి వెనుక ఉన్న కారణాలని కూడా చాలా విపులంగా చెప్పాడు.

మరోసారి ఈ వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకోగలిగాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS