క్యూట్ భామ లైలా.. ఒకప్పుడు యూత్‌కి క్రేజీయెస్ట్ హీరోయిన్. హీటెక్కించే ఫిజిక్, ఆకట్టుకునే అభినయంతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. వెంకటేష్, బాలయ్య వంటి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు.. కదా ఇప్పుడెందుకీ భామ టాపిక్ వచ్చింది అనుకుంటున్నారా? మన బాలయ్య బాబు ఉన్నారు కదా.. ఆయన ద్వారానే ఈ టాపిక్ రైజ్ అయ్యింది.
బాలయ్యతో లైలా.. కలిసి దిగిన ఫోటోలు కొన్ని నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అంటే బాలయ్య సినిమాలో లైలా నటిస్తోందా? అనే అనుమానాలు వచ్చేయొచ్చు. కానీ, కాదు. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్.రవికుమార్ సినిమా నిమిత్తం విదేశాల్లో షూటింగ్స్ అంటూ ఇద్దరు భామల ముద్దుల కృష్ణయ్యలా ఓ వైపు వేదిక, ఇంకోవైపు సోనాల్ చౌహాన్‌ని వెంటేసుకుని జాలీగా తిరుగుతున్నారు. ఆ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో అలనాటి నటి మేటి నటి లైలాని కలిశారు. ఒకప్పుడు కో స్టార్ కదా.. ఆమెతో కాసేపు ముచ్చటించి, ఫోటోలకు పోజిచ్చారు.
ఆ ఫోటోలే ఇప్పుడు నెట్టింట్లో స్వైర విహారం చేసేస్తూ, గాసిప్స్‌కి కేంద్రబిందువులయ్యాయి. అయితే, జస్ట్ క్యాజువల్‌గానే బాలయ్య, లైలాని కలిశారట. సినిమా కోసం కాదని తెలుస్తోంది. 'పవిత్ర ప్రేమ' సినిమాలో బాలయ్య, లైలా కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అప్పట్లో. అదండీ 'బాలయ్యతో లైలా' ముచ్చట.