ఫస్ట్‌లుక్‌: 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ఇంత వైలెంట్‌గా ఉన్నాడేంటీ.?

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ మరోసారి 'అర్జున్‌రెడ్డి'ని గుర్తు చేశాడు. అఫ్‌కోర్స్‌ 'అర్జున్‌రెడ్డి'ని ఆడియన్స్‌ మర్చిపోలేదులెండి. అయినా మరోసారి అదే గెటప్‌లో కనిపించి షాక్‌ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌లో చాలా వైలెంట్‌గా కనిపిస్తున్నాడు మన రౌడీ. పొడుగు జుట్టు, మాసిన గెడ్డం, చేతిలో సిగెరెట్‌. కోపంగా పొగలు వదులుతూ, ముఖం మీద రక్తపు మరకలతో, పైన బటన్స్‌ ఓపెన్‌ చేసిన షర్టు ఇలా.. అంతా అచ్చం 'అర్జున్‌ రెడ్డి' ఆటిట్యూడే కనిపిస్తోంది ఈ లుక్‌లో.

 

అదేంటీ? క్రాంతి మాధవ్‌ సినిమాల్లో హీరోలు చాలా కూల్‌గా ఉంటారు.. కదా ఇదేంటీ రౌడీని ఆయన ఇలా చూపించారు.. అనుకుంటున్నారా.? ఇందులో మన రౌడీ ఏకంగా నాలుగు రకాల వేరియేషన్స్‌లో కనిపిస్తారట. ఆ నాలుగింటిలో ఇదొకటి కాబోలు. అయితే, 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' అని టైటిల్‌ పెట్టినందుకు, కూల్‌ పోస్టర్‌ని ఫస్ట్‌లుక్‌గా రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేది.. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ద బెస్ట్‌ ఇంప్రెషన్‌ కదా.. అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

 

అయితే, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ అసోసియేషన్‌ రౌడీస్‌ గ్యాంగ్‌ మాత్రం చితక్కొట్టేశావ్‌.. చంపేశావ్‌.. ఇరగదీసేశావ్‌.. అనే కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. అలా మన రౌడీ మరోసారి 'అర్జున్‌ రెడ్డి' ఆటిట్యూడ్‌ చూపించాడన్న మాట. ఈ సినిమాలో రౌడీ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరీన్‌ ట్రెసా, ఇసాబెల్లె హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS