లైంగిక వేధింపులు అనే మాట ఈ మధ్య ఇంటా, బయటా బాగా వినిపిస్తోన్న మాటే. మహిళలపై ఈ అరాచకాలకు తన, పరా బేధాలే లేకుండా పోయాయి. ఇది సొసైటీ సంగతి. ఈ విషయం పక్కన పెడితే, సినీ రంగంలోనూ ఆడవారిని లైంగికంగా వేధించే మృగాళ్లు లేకపోలేదు. బాలీవుడ్ నుండి, టాలీవుడ్ దాకా అవకాశాల కోసం లైంగిక వేధింపులు అనే మాట ఎప్పటికప్పుడే వింటూంటాం. సినీ రంగంలో ఇది చాలా సర్వ సాధారణ విషయం. అయితే ఈ విషయంపై ఇంతవరకూ క్వశ్చన్స్ రైజ్ కాలేదు. తెర వెనుక కామ్‌గా జరిగిపోయేవి.
కానీ ఈ మధ్య హీరోయిన్స్‌కి ఈ ప్రశ్నలు చాలా కామన్ అయిపోయాయి. ఇదే విషయాన్ని మీడియా అడుగుతుంటే, ఒకరిద్దరు నో కామెంట్ అంటున్నా, చాలా మంది స్పందిస్తున్నారు. అవకాశాలు ఇస్తామని లోబర్చుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రత్యక్షంగా తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని చెబుతోంది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్. అయితే పరోక్షంగా ఇలాంటి ప్రోబ్లమ్‌ని ఫేస్ చేశానని మాత్రం చెబుతోంది. పరోక్షంగా తనపై కొందరు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారనీ లక్ష్మీరాయ్ చెప్పింది.
ఇలాంటి పరిస్థితి లేనప్పుడు వ్యక్తిత్వంలో స్ట్రాంగ్‌నెస్ ఉండాలి. ఆ స్ట్రాంగ్‌నెస్ నాకుందంటోంది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్. అలాంటి పరిస్థితే ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సి వస్తే అవకాశాలు వదులుకోవడానికి అయినా తాను సిద్ధమే అంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లో 'జూలీ - 2' సినిమాలో నటిస్తోంది. ఇదో అడల్ట్ కంటెన్ట్ మూవీ. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది 'జూలీ - 2'. బాలీవుడ్‌లో లక్ష్మీరాయ్‌కిది తొలి సినిమా.