లక్ష్మీరాయ్‌ గ్లామర్‌కి ఆకాశమే హద్దు

మరిన్ని వార్తలు

లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'జూలీ-2' విడుదలకు దగ్గరవుతోంది. దాంతో ప్రమోషన్స్‌ జోరు పెంచేశారు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌ హీటెక్కించేశాయి. అంతకన్నా ఎక్కువగా కిర్రాకు పుట్టించేస్తోంది తాజాగా విడుదలైన సాంగ్‌ ప్రోమో. ఇందులో లక్ష్మీరాయ్‌ ఎక్స్‌పోజింగ్‌తోనే కాదు, తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ చంపేస్తోందంతే. అయితే ఈ పాటలో లక్ష్మీరాయ్‌ కొంత బొద్దుగా కనిపిస్తోంది. సినిమా అంతటా లక్ష్మీరాయ్‌ ఒకేలా కనిపించే అవకాశం లేదని ఈ పాటని బట్టి అర్థమవుతోంది. స్వతహాగా కొంచెం బొద్దుగా, నాజూగ్గా ఉండే లక్ష్మీరాయ్‌, ఈ సినిమాలో బికినీ కోసమే కొంచెం బక్క పలచగా మారింది. అలా బక్క పలచగా మారిన ఫిజిక్‌కీ, కొంచెం నాజూగ్గా ఉన్న ఫిజిక్‌కీ చాలా తేడా కన్పిస్తోంది. ఇంతవరకూ కనిపించిన ప్రమోస్‌లో లక్ష్మీరాయ్‌ నాజూగ్గా కనిపించి కవ్వించింది. లేటెస్టుగా విడుదలైన ఈ సాంగ్‌ ప్రోమోలో కొంచెం బొద్దుగా కనిపించి తన అందాలతో మరింత మత్తెక్కిస్తోంది. అంటే 'జూలీ -2'లో లక్ష్మీరాయ్‌ అందాలను చూసి, ఎవరికి ఎలా కావాలంటే అలా ఎంజాయ్‌ చేయొచ్చన్నమాట. అందుకే అంటారు చక్కనమ్మ చిక్కినా అందమే, బొద్దుగా తయారైనా అందమే. ఏదేమైనా లక్ష్మీరాయ్‌ సొగసులకి ఆకాశమే హద్దు అనేంతలా 'జూలీ-2' ప్రమోషన్స్‌ సాగుతూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS