'రత్తాలు రత్తాలు' అంటూ టాలీవుడ్‌ని ఊపు ఊపేసింది అందాల లక్ష్మీరాయ్. మెగాస్టార్ 150వ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అంతకు ముందు అనుకున్న ఓ యంగ్ హీరోయిన్‌ని కాదని మరీ ఆ పాట కోసం లక్ష్మీరాయ్‌ని తీసుకొచ్చారు. అందుకు తగ్గట్లుగానే తన హాట్‌నెస్‌తో ఆ పాటకి వెయిట్ తెచ్చిపెట్టింది. అయితే అమ్మడు సెక్సప్పీల్ గురించి ఓ హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చిందండోయ్. సెక్సప్పీల్ అంటే ఎక్స్‌పోజింగ్‌లో ఉండదట. కళ్లల్లో ఉంటుంది అంటూ కైపెక్కే కళ్లతో, భీభత్సమైన క్లీవేజ్ పోజుతో చెప్పేస్తే ఎలా ఉంటుంది. అమాంతం మతులు పోవట్లేదూ. బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన 'జూలీ 2' సినిమాతో ఆశించిన సక్సెస్ అందుకోకపోయినా, ఊహించని క్రేజ్ అయితే సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే ప్రస్తుతం లక్ష్మీరాయ్ తమిళ, తెలుగు భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో లక్ష్మీరాయ్ నటిస్తోంది.