డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ సింగర్

మరిన్ని వార్తలు

డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడిన సెలబ్రిటీల జాబీతాలో తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చేరాడు.

హైదరాబాద్ లో నిన్న జరిగిన డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టుగా టెస్టులో తేలింది. దీనితో వెంటనే ఆయన నడుపుతున్న వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.

ఇక బ్రీథ్ టెస్ట్ చేసే సమయంలో పోలీసులకి రాహుల్ మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడగా అక్కడున్నవారు రాహుల్ కి నచ్చజెప్పి టెస్ట్ కి సహకరించేలా చేశారు. పోలీసులు రాహుల్ కారుని ఆపిన సమయంలో ఆ కారులో ప్రముఖ యాంకర్ లోబో కూడా ఉన్నారు.

ఒక వారం రోజుల్లో పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్ కి రాహుల్ సిప్లిగంజ్ హాజారుకానున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS