నేహా ధూపియా ప్రధాన పాత్రలో గతంలో తెరకెక్కిన 'జూలీ' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'జూలీ - 2'. లక్ష్మీరాయ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. అడల్ట్ కంటెన్ట్ మూవీ ఇది. సెన్సార్ బోర్ట్ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా హీరోయిన్‌గా అంతగా పాపులారిటీ సంపాదించుకోకపోయినప్పటికీ, రాయ్ లక్ష్మీకి తెలుగులో మెగా ఐటెం బాంబ్‌గా మంచి పేరొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవితో 'రత్తాలు..' సాంగ్‌తో ఊపు ఊపేసింది. ఇప్పుడు తాజాగా ఈ 'జూలీ - 2'. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది లక్ష్మీ రాయ్.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా మంచి విజయం అందుకోవాలంటూ లక్ష్మీరాయ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రేపే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి కొత్త రకం పబ్లిసిటీ యాడ్ అయ్యింది. ఈ సినిమా దక్షిణాదిలో పాపులర్ అయిన ఓ హీరోయిన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిందంటూ ప్రచారం జరుగుతోంది. స్వయంగా చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే సినిమా విడుదలకు సిద్ధమైన వేళ వివాదాలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో ఆమె పేరును డైరెక్ట్‌గా ప్రకటించలేకపోతున్నామనీ చిత్ర యూనిట్ చెప్పింది. ఏది ఏమైనా ఈ ప్రచారం సినిమాపై మరింత ఆశక్తిని పెంచేలా ఉంది.
బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతుండడం విశేషం. మొదట్లో ఈ సినిమాలో నటించేందుకు లక్ష్మీరాయ్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. తర్వాత ఓ నటి తన కెరీర్‌లో ఎదగడానికి పడిన కష్టాన్ని తెలియజెప్పే కథతో కూడిన చిత్రం కాబట్టి నటించేందుకు ఒప్పుకుందట. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయట. ఈ చిత్రం కోసం లక్ష్మీరాయ్ ఏకంగా 20 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా మరింత అందంగా తయారైంది. నూరు రకాల బికినీలతో లక్ష్మీరాయ్ స్కిన్ షో చేసింది. ఈ సినిమా లక్ష్మీరాయ్‌కి 50వ సినిమా కావడం మరో విశేషం.