గ్లామ్‌షాట్‌: 'బాత్‌' టబ్‌లో బుల్లెమ్మా.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌లో రత్తాలు గ్లామర్‌ వేరయా అనడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు, కళ్లు జిగేల్‌మనే స్కిన్‌ కలర్‌, ఏ కాస్ట్యూమ్‌కైనా ఇట్టే మ్యాచ్‌ అయిపోయే ఫిజిక్‌ లక్ష్మీరాయ్‌ సొంతం. బాలీవుడ్‌లో తెరకెక్కిన 'జూలీ 2' సినిమా పుణ్యమా అని బికినీ గాళ్‌గా రికార్డు సృష్టించేసిందీ హాట్‌ బ్యూటీ. ఏకంగా నూరు రకాల బికినీ పోజులతో రెచ్చిపోయింది ఆ సినిమా కోసం. అయితే అమ్మడి కష్టం వృధా అయిపోయిందిలే అది వేరే విషయం. 

 

అంతకన్నా ముందే మెగాస్టార్‌ చిరంజీవితో 'రత్తాలూ..' సాంగ్‌లో చిందేయడంతో లక్ష్మీరాయ్‌కి టాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అయితే ఆ క్రేజ్‌ని యూజ్‌ చేసుకోవడం కుదరలేదు లక్ష్మీరాయ్‌కి. ఏదైతేనేం రత్తాలు అనే ట్యాగ్‌ లైన్‌ని మాత్రం తన పేరు ముందుకు తెచ్చేసుకుంది. ఐటెం సాంగ్స్‌లో 'రత్తాలు సాంగ్‌' ది స్పెషల్‌ అనిపించుకుంది. 

 

ఇకపోతే అప్పుడొచ్చిన క్రేజ్‌ని సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు మాత్రం యూజ్‌ చేసుకుంది హాట్‌ హాట్‌ రత్తాలు. బికినీలో అందాలు ఆరబోస్తూ, సోషల్‌ మీడియాకి సెగలు పుట్టించేసింది. తాజా పిక్‌ విషయానికి వస్తే, బాత్‌ టబ్‌లో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ టూ పీస్‌ బికినీలో లక్ష్మీరాయ్‌ తాజా తాజా తడి తడి అందాలు వింటర్‌లో వెచ్చ వెచ్చగా గిలిగింతలు పుట్టించేస్తున్నాయ్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS