'వినయ విధేయ రామ' సినిమాలో సీత, రాముడి పాత్రల్లో నటిస్తున్నారు కైరా అద్వానీ, చరణ్. సినిమా 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు. బ్రైట్‌గా డిజైన్ చేసిన పోస్టర్స్ కళ్లు చెదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా..! అనే ఆశక్తిని అభిమానుల్లో పెంచేస్తున్నాయి. ఇంతవరకూ మూడు వీడియో సాంగ్ ప్రోమోస్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక నాలుగో సాంగ్ 'రామ లవ్స్ సీత..' ప్రోమో వీడియోను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయం ప్రకటిస్తూ, వదిలిన స్టిల్‌కి మాస్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మొన్న లంగా వోణీలో రాముని అరచేతిలో పాదం మోపి నిలబడిన సీత ఇప్పుడు పక్కా మాస్ గెటప్‌లోకి వచ్చేసింది. కళ్లకు గాగుల్స్ పెట్టుకుని వైట్ మోడ్రన్ డ్రస్సులో కైరా, క్యాచీ మాస్ గెటప్‌లో చరణ్ అదరగొట్టేస్తున్నారీ స్టిల్‌లో.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియో ఆల్రెడీ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. వీడియో ప్రోమోస్‌తో మరింత ఓలలాడిస్తున్నారు. యాక్షన్ స్టిల్స్‌తో చరణ్ కిర్రాకు పుట్టిస్తున్నాడు. కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించాడు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.