అందానికి అందం, ఆకర్షించే సోయగం లక్ష్మీరాయ్ సొంతం. ప్రస్తుతం లక్ష్మీరాయ్ 'జూలీ - 2' సినిమాలో నటిస్తోంది. బోల్డ్ కంటెన్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇందులో లక్ష్మీరాయ్ అందాల ఆరబోతకి ఆకాశమే హద్దు. నూరు రకాల బికినీ సొగసులతో ఆడియన్స్‌ని చూపు తిప్పుకోనీయకుండా చేసేయనుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ కెవ్వు కేక పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అమ్మడు సోషల్ మీడియాని ఫుల్‌గా హీటెక్కించేస్తోంది. ఇదిగో ఇలా. జీన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లుంది కదా. కానీ కాదు. ట్రెండీగా ఉంది కదా అని ఈ పేటర్న్ ట్రై చేసింది మన రత్తాలు. సింప్లీ సూపర్బ్ కదా. దటీజ్ రత్తాలు. బికినీ వేసినా, జీన్స్ వేసినా ఆమె అందం ప్రత్యేకత అలాంటిది. ఇట్టే దృష్టిని తన వైపు లాగేస్కుటుంది. అదే చేస్తోంది ఈ డ్రస్సులో రత్తాలు లక్ష్మీరాయ్.