రాజీవ్-సుమ కనకాల ఇంట విషాదం

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు దేవదాసు కనకాల గారి భార్య శ్రీ లక్ష్మిదేవి కనకాల (78) గారు ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 

గత కొంతకాలంగా ఆమె తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా సమాచారం. దేవదాసు కనకాల గారితో కలిసి లక్ష్మీదేవి గారు ఎంతో మంది స్టార్ హీరోలకి నటనలో ఓనమాలు దిద్దించారు. అందులో ముఖ్యంగా రజినీకాంత్, చిరంజీవి, సుధాకర్, శుభలేఖ సుధాకర్, రాజేంద్రప్రసాద్ వంటి వారు అనేకమంది ఉన్నారు.

ఇక ఈ వార్త తెలియగానే మా అధ్యక్షులు శివాజీరాజ, ప్రధాన కార్యదర్శి నరేష్ లు శ్రీ లక్ష్మీదేవి కనకాల మృతికి తీవ్ర సంతాపం తెలియచేశారు. అంత్యక్రియలకి సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. లక్ష్మీదేవి గారికి ఇద్దరు సంతానం. అందులో ఒకరు రాజీవ్ కనకాల కాగ మరొకరు ప్రముఖ టెలివిజన్ యాక్టర్ శ్రీలక్ష్మి. 

లక్ష్మీదేవి కనకాల గారి మృతికి మా  www.iQlikmovies.com తరపున తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS