డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హిందీ సినిమాల జాతర!

By Inkmantra - June 30, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

సినిమా థియేటర్లు గత మూడు నెలలకు పైగా మూతబడి ఉండడంతో చాలామంది ఫిలిం మేకర్లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంలో చాలా ముందంజలో ఉన్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన డిస్నీ + హాట్ స్టార్ వారు తమ ప్లాట్ ఫామ్ లో వచ్చే నాలుగు నెలల కాలంలో విడుదల కానున్న సినిమాల లిస్టును ప్రకటించారు. ఈ లిస్టులో ఉన్న సినిమాలను ఒకసారి చూద్దాం.

 

అక్షయ్ కుమార్- కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'లక్ష్మి బాంబ్' ఈ లిస్టులో ఉంది. లారెన్స్ రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ముని2: కాంచన' కు రీమేక్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సినిమాలో సంజనా సంఘి హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు.

 

'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' ఈ లిస్టులో మరో సినిమా. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనక్షి సిన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్, సంజయ్ దత్, పూజా భట్ నటించిన 'సడక్ 2' ఈ లిస్టులో ఉంది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన 'ది బిగ్ బుల్' కూడా ఈ లిస్టులో ఉంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ హీరో. ఇవి కాకుండా విద్యుత్ జమ్వాల్ 'ఖుదా హాఫిజ్', కునాల్ ఖేము 'లూట్ కేస్' కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ జులై నుంచి అక్టోబర్ మధ్యలో స్ట్రీమింగ్ చేస్తారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS