వర్మ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏమైందో తెలీదు. 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే మరో సినిమా అతీ గతీ లేదు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. కాగా వివాదాలతో సావాసం చేసే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడా? ఎన్టీఆర్ ఆత్మ ఈ సినిమా చేసేందుకు తనను ప్రోత్సహించింది అని ఆయన చెప్పాడు కానీ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏమైందో వర్మ సమాధానమివ్వట్లేదు.
ఇంతలో బాలయ్య 'ఎన్టీఆర్' సినిమా ఇటీవల సెట్స్ మీదికి వెళ్లడం, లేటెస్టుగా వివాదాల్లోకెక్కడం చకచకా జరిగిపోయాయ్. ఇప్పుడు ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్లే అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఎన్టీఆర్ ఆత్మే ఈ సినిమాలకు అడ్డుపడుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే, ఏంటి? ఈ పరిణామాలు? ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన 'ఎన్టీఆర్' సినిమా ఆగిపోవడం, మిగిలిన సినిమాలు ఇంకా కార్య రూపం దాల్చకపోవడం ఇదంతా చూస్తుంటే, దీనికంతటికీ కారణం ఏంటో తెలీయడం లేదు. కానీ ఎన్టీఆర్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నే ఇది.
ఎన్టీఆర్ అంటే మహానుభావుడు, దేవుడుగా భావించే జనం, ఆయన జీవిత గాధలోని అనుచిత యాంగిల్స్‌ని బయటపెడితే తట్టుకోలేరు. అందుకేనేమో ఆయన బయోపిక్స్ విషయంలో ఇలాంటి అననుకూల పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వర్మ చెప్పినదాని ప్రకారం తన సినిమా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి యాంగిల్ నుండి ఉంటుందని చెప్పాడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లెక్కల ప్రకారం ఎన్టీఆర్‌ని కలవడానికి ముందు లక్ష్మీ పార్వతి ఏంటి? అనే కథనంలో ఉంటుందన్నాడు. మొత్తానికి వరుస అనౌన్స్‌మెంట్స్‌తో సెన్సేషన్ రేపిన ఎన్టీఆర్ బయోపిక్స్ రీజన్‌లెస్‌గా కామ్‌అప్ అయిపోయాయి. చూడాలి మరి ఇకపై ఏం జరుగుతుందో.!