తొలి సినిమా ‘అందాల రాక్షసి’లో ఎలా కనిపించిందో, ఇప్పుడు తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాలోనూ దాదాపు అలాగే కనిపిస్తోంది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. నటన, దాంతోపాటు సూపర్బ్ గ్లామర్ లావణ్య సొంతం. ఈ బ్యూటీ తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమా టీజర్‌తో ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. ‘నాలుగు పీకి, ఇక్కడ పడుకోబెడితే, నీకు కూడా నేను సిస్టర్‌నే అవుతా’ అంటూ లావణ్య చెప్పిన డైలాగ్ ట్రెండింగ్ అవుతోంది.
దానికి ముందు హీరో కార్తికేయ, ‘మనం ప్రేమించిన అమ్మాయి మనకి తప్ప, మిగిలినోళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదయితే వుందో..’ అని డైలాగ్ చెబుతాడు. కార్తికేయ డిక్షన్ అదిరిపోయింది. లావణ్య రిప్లయ్ ఇంకా అదిరిపోయింది. ఊర మాస్ గెటప్‌లో కార్తికేయ అదరగొట్టేస్తే, డీ గ్లామర్ లుక్‌లో లావణ్య, రెట్రో ఫీల్ తీసుకొచ్చింది. ఇక, ఈ టీజర్ చూసిన తర్వాత అందరికీ ఆమె నటించిన తొలి సినిమా ‘అందాల రాక్షసి’ గుర్తుకు వస్తోంది. అంత క్యూట్‌గా, సహజంగా ఆమె కనిపించింది.
ఈ సినిమాలో అనసూయ, ఆసుపత్రిలో నర్సుగా నటిస్తోంటే, మార్చురీ నుంచి మృతదేహాల్ని తరలించే వ్యాన్ డ్రైవరుగా నటిస్తున్నాడు కార్తికేయ. తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం అని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఏదిఏమైనా, లావణ్య డీ గ్లామర్ లుక్ ఈ సినిమాకి హైలైట్ అయ్యేలా వుంది.