ఆ భయం తనకు లేదంటున్న శృతిహాసన్

మరిన్ని వార్తలు

అందాల భామ శృతిహాసన్ తన తాజా చిత్రం ‘క్రాక్’తో మంచి విజయాన్నే అందుకుంది. ‘విజయం ఎప్పడూ మంచి కిక్ ఇస్తుంది. నా వరకూ నేనెప్పుడూ 100 శాతం ఎఫర్ట్స్ పెడతాను. కానీ, ఫలితం అన్ని సందర్భాల్లోనూ మనతోనే వుంటుందనుకోవడం పొరపాటు.. సక్సెస్ సాధిస్తే పొంగిపోను.. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోను..’ అంటూ శృతిహాసన్ వ్యాఖ్యానించింది. ‘ఫెయిల్యూర్ పట్ల ఎప్పడూ భయం వుండదు. సక్సెస్ మాత్రం బాధ్యతను పెంచుతుంది..’ అని ఓ ప్రశ్నకు బదులిచ్చింది శృతిహాసన్.

 

‘కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశాను. విజయాలు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు, బాధ్యతను పెంచుతాయి. ఫెయిల్యూర్స్, మనల్ని మనం రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడతాయి..’ అని చెప్పింది ఈ అందాల భామ. ప్రస్తతుం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తోన్న శృతి అందులో తన పాత్ర నిడివి తక్కువే అయినా, సినిమాలో అత్యంత కీలకమైనదని చెప్పింది. ‘వకీల్ సాబ్’ తర్వాత నటించే తెలుగు సినిమా ఏంటన్న ప్రశ్నకు బదులివ్వలేదు ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో మాత్రం ఓ సినిమా చేస్తోందట.

 

తమిళంలో రెండు సినిమాలున్నాయి శృతిహాసన్‌కి. ‘నా జీవితంలో కొన్ని అనుకోని ఘటనలు జరిగాయి. వాటి కారణంగా కెరీర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నేను ఫుల్ హ్యపీ’ అని అంటోంది శృతిహాసన్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS