బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన లావణ్య

మరిన్ని వార్తలు

రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా నుండి తప్పుకుందట. ఏమైందో ఏమో తెలీదో కానీ, ఆ ఆఫర్‌ వచ్చి లావణ్యను వరించింది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలిసారిగా రామ్‌తో జత కడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'నేను శైలజ..' సినిమా మంచి విజయం అందుకుంది. లేటెస్టు మూవీని స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ న్యూ లుక్‌తో కనిపించనున్నాడు. మేఘా ఆకాష్‌ విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టు బ్యాక్‌ నితిన్‌తో రెండు సినిమాలు చేసేస్తోంది. 'లై' తర్వాత నితిన్‌తోనే మరో సినిమాలో నటించనుంది ఈ ముద్దుగుమ్మ. మరో పక్క లావణ్య త్రిపాఠి అక్కినేని బుల్లోడు నాగ చైతన్యతో 'యుద్ధం శరణం' సినిమాలో నటిస్తోంది. ఆర్‌. వి, కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జునతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొడుకు నాగచైతన్యతోనూ ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS