ప్రభాస్ టాలీవుడ్ హీరో నుంచి మొదట పాన్ ఇండియా స్టార్ గా, ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు. కల్కి మూవీ రికార్డ్స్ తో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికి కల్కి 1000 కోట్ల మార్క్ ని చేరుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ని క్యాష్ చేసుకునే దిశగా మిగతా ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి. రాజా సాబ్, హను రాఘవ పూడి సినిమాలతో పాటు సందీప్ వంగాతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. వీటి తరవాత సలార్ 2, కల్కి 2 రానున్నాయి. ఈ ఏడాది చివరికి రాజా సాబ్ రిలీజ్ కానుందని సమాచారం. మారుతీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో రూపొందుతోంది.
స్పిరిట్ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ యాక్టర్ 'మా డాంగ్ సియోక్' నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యానిమల్ సినిమాతో విమర్శలతో పాటు క్రిటిక్స్ మెప్పు పొందిన సందీప్ వంగా స్పిరిట్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ మూవీని ఇండియన్ భాషలతో పాటు కొరియన్, చైనీస్ భాషల్లోకి డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ కొరియన్ యాక్టర్ ని సందీప్ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గూర్చి టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా, 'మా డాంగ్ సియోక్' వీకీపీడియా పేజీలో అతడు స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా డార్లింగ్ సినిమాలో విలన్‌గా ఒక కొరియన్ యాక్టర్ నటించటం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్ విలన్ ని సందీప్ పోటీకి దించాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.