'అందాల రాక్షసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. గతేడాది నాగార్జునతో 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాతో ఆలరించింది. నానితో నటించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం నుండీ అమ్మడికి దశ తిరిగిపోయింది. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చాలానే సినిమాలున్నాయి. తాజాగా వరుణ్ తేజ్‌తో 'మిస్టర్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో 'నేను అందమైన అమ్మాయిని, అంతకన్నా అందంగా నా పేరుటుంది' అంటూ ఈ ముద్దుగుమ్మ తన గొప్పతనం తానే చెప్పుకుంటుంది. అలా తన చిలిపి మాటలతోనే హీరోని తనతో లవ్‌లో పడేలా చేసేస్తుందట. ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో. ఇంతవరకూ లావణ్య డిగ్నిఫైడ్ పాత్రల్లోనే కనిపించి మెప్పిస్తోంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో మాత్రం కొంచెం హాట్‌గా కనిపించింది. కానీ అమ్మడు స్క్రీన్‌పై కనిపించేంత ట్రెడిషనల్ ఏమీ కాదంట. రియల్ లైఫ్‌లో చాలా అల్లరి పిల్లంట. అందుకే ఒక్కసారైనా తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి తగ్గ క్యారెక్టర్‌లో నటించాలని ఉందంటోంది. త్వరలోనే మెగా ప్రిన్స్ సినిమాతో రాబోతున్న ఈ ముద్దుగుమ్మ తన చిలిపి చేష్టల గురించి ఇలా అభిమానులతో పంచుకుంది. శీను వైట్ల డైరెక్షన్‌లో రాబోతున్న 'మిస్టర్'లో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. వచ్చే నెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.