ప్రయోగాలే చేస్తానంటోన్న ‘అందాల రాక్షసి’.

By Inkmantra - March 10, 2020 - 16:02 PM IST

మరిన్ని వార్తలు

‘అందాల రాక్షసి’ సినిమాతో అందంగా పరిచయమైన అభినయ నటి లావణ్య త్రిపాఠి. గ్లామర్‌తో పాటు, యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా పుష్కలంగా ఉన్న నటి లావణ్య. ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ కొట్టి, ‘సోగ్గాడే చిన్నినాయనా’లో స్టార్‌ హీరో నాగార్జునతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం బిజీగా సినిమాలు చేస్తున్నా, చెప్పుకోదగ్గ సక్సెస్‌లేమీ కావవి. అయితే, త్వరలో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలో లావణ్య ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తోంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం లో. హాకీ క్రీడాకారిణిగా లావణ్య కనిపించనుంది.

 

సినిమా కోసం ప్రత్యేకంగా హాకీలో శిక్షణ తీసుకుందట లావణ్య. ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నానంటోంది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు యంగ్‌ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలోనూ లావణ్య నటిస్తోంది. ఇకపై ప్రయోగాత్మక చిత్రాల్లో కనిపించాలనుకుంటున్నానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో లావణ్య చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో సోషల్‌ మీడియానీ స్పెషల్‌గా హీటెక్కించేయాలనుకుంటోన్న లావణ్యకు అక్కడ కూడా రెస్పాన్స్‌ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 5


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS