చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బాలాదిత్య, ‘చంటిగాడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెచ్చుకున్న పేరును హీరోగా నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో చదువు నిమిత్తం కాస్త గ్యాప్ తీసుకుని, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అంతంత మాత్రంగానే నిలిచాడు. బిగ్ స్క్రీన్‌తో పాటు, బుల్లి తెరనూ అలంకరిస్తున్నాడు. కొన్ని రియాల్టీ షోస్‌తో పాటు, ఈ మధ్య సీరియల్స్‌లోనూ సందడి చేస్తున్నాడు బాలాదిత్య. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌తోనూ బిజీగా ఉన్నాడు. బుల్లి తెరపై బిజీ గ ఉంటూనే, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా కనిపిస్తున్నాడు.
ఇటీవల సంచలనమైన అమృత, ప్రణయ్ ప్రేమకథను బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’లో బాలాదిత్య ప్రణయ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రలో నటించడం కోసం కొంత గ్రౌండ్ వర్క్ చేశాడట ఆదిత్య. పాత్రలో నేచురాలిటీ తీసుకొచ్చేందుకు స్వయంగా ప్రణయ్ కుటుంబ సభ్యుల్ని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాడట. తెలుగు రాష్ట్రాల్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రేమ విషాదాంత గాధను స్క్రీన్‌పై మరింత హార్ట్ టచ్చింగ్‌గా మలిచారనీ, అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా రియాల్టీతో పాటు, కొన్ని కమర్షియల్ హంగులు కూడా అద్దడంతో సినిమా యూత్‌లో బాగా క్లిక్ అవుతుందనీ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు బాలాదిత్య. అమృత పాత్రలో తెలుగమ్మాయ్ అర్చన కనిపించనుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి నర్రా నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు.