కాక రేపుతున్న హై ఓల్టేజ్‌ లావణ్య

మరిన్ని వార్తలు

అందాల రాక్షసి అందంలోనే కాదు, హాట్‌నెస్‌ డోస్‌ కూడా బాగా పెంచేసింది. తాజాగా 'ఇంటెలిజెంట్‌' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతవరకూ రిలీజైన్‌ పోస్టర్స్‌లో లావణ్య గ్లామర్‌ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపిస్తోంది లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కటింగ్స్‌, లావణ్య అందాలు యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. పోస్టర్స్‌ని చాలా రొమాంటిక్‌గా, గ్లామరస్‌గా డిజైన్‌ చేశారు. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ మాత్రమే హాట్‌ ఫోటోలతో ఎట్రాక్ట్‌ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 'ఇంటెలిజెంట్‌' పుణ్యమా అని ఓవర్‌ డోస్‌లో ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఎట్రాక్ట్‌ చేస్తోంది. అంతేకాదు, కాస్త బక్క పలచగా ఉండే లావణ్య ఈ సినిమాలో కొంచెం బొద్దుగా, ముద్దుగా కనిపిస్తోంది. దాంతో ఆమె గ్లామర్‌ మరింత హైలైట్‌ అవుతోంది. గ్లామర్‌ ప్రియులు లావణ్య అందానికి ఫిదా అయిపోతున్నారు. విడుదలకు ముందే ఈ రేంజ్‌లో అమ్మడు హీటు పుట్టిస్తోంటే, ఇక సినిమాలో ఇంకెంత కాక రేపేసిందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS