నాలుగేళ్ళ క్రితం నటి జియా ఖాన్ ఆత్మహత్య సంఘటన మొత్తం చలనచిత్ర రంగాన్నిఒక కుదుపు కుదిపేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒక యంగ్ హీరో అని ఆరోపణలు రావడమే.
ఇక ఈ అంశంలో CBI ఎంక్వయిరీ కావాలి అని జియా ఖాన్ తల్లి కోరడంతో ఆ కేసుని CBIకి అప్పగించడం జరిగింది. వారు విచారణ పూర్తిచేసి, ఈ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ లో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్నది వాస్తవేమేనని అయితే అందుకు ప్రేరేపించేలా చేసింది సూరజ్ పంచోలినే అని పేర్కొంది.
ఆ ఛార్జ్ షీట్ లో వివరాల ప్రకారం- సూరజ్ పంచోలి కారణంగా జియా ఖాన్ గర్భం దాల్చడం, దానిని అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించగా అది వికటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి సూరజ్ సదరు డాక్టర్ తో మాట్లాడిన సంబాషణ రికార్డులని కూడా కోర్టుకి అందచేశారు.
ఇక జియా ఖాన్ తన సూసైడ్ నోట్ లో తాను సూరజ్ ని ఎంతాగానో ప్రేమించినప్పటికి అతను మాత్రం తనని బాధపెట్టడం తప్ప వేరే ఏమి చేయలేదు అని చెప్పింది.
ఇక దీని ప్రకారం, సూరజ్ పంచోలి పైన ఈ కేసుకి సంబంధించి విచారణ ఫిబ్రవరి 14 నుండి జరగనుంది. మొత్తానికి ఆమె చనిపోవడానికి ముఖ్య కారకుడిగా సూరజ్ పంచోలి పేరు మళ్ళీ తెరపైకి రావడంతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.