లావణ్యకి 3 కోట్ల ఫైన్ పడిందట?!

మరిన్ని వార్తలు

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠికి తమిళ నిర్మాతల సంఘం నుండి భారీగా జరిమానా పడిందన్నవార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

 

వివరాల్లోకి వెళితే, 100% లవ్ తెలుగు చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ముందుగా తీసుకున్నారు, అయితే కొన్నిరోజుల షూటింగ్ అనంతరం లావణ్య ఆ చిత్రం నుండి తప్పుకుంది.

అయితే లావణ్య ఈ చిత్రాన్ని మధ్యలోనే వదిలి వెళ్ళిపోవడానికి కారణలు తెలియదు.ఆ తరువాత లావణ్య స్థానంలో అర్జున్ రెడ్డి మూవీ ఫేం శాలిని పాండేని తీసుకున్నారు. ఈ తరుణంలో సదరు చిత్ర నిర్మాత తనకి ఈ హీరోయిన్ మార్పు వల్ల కలిగిన నష్టంతో నటి లావణ్యకి రూ 3కోట్ల జరిమానా విధించమని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు.

మరి ఈ పరిణామంతో లావణ్యకి రూ 3కోట్ల జరిమానా పడనుందా లేదా అనేది తెలియాలి..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS